తారాచౌదరి సహాయకుడు హనీఫ్‌ను శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట హాజరుపర్చగా తారాతో ఉన్న సంబంధంపై హనీఫ్ మాట్లాడుతూ తారా చౌదరి బ్యాంకు అకౌంట్లలో రూ.70 లక్షల లావాదేవీలు జరిగాయని తారా చౌదరి పలు సినిమాలకు ఫైనాన్స్ చేసిందని తెలిపాడు. తాను వెళ్లి పోతానంటే తారా చౌదరి బెదిరించేదని తాను ఆమె దగ్గర ఏడాది పాటు హౌస్ అరెస్ట్‌గా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆమె దగ్గర వెట్టిచారికి చేశానని చెప్పాడు.
రెండేళ్ల క్రితం తారా చౌదరి ఓ బ్యానర్ పైన మూవీ తీసేందుకు కూడా సిద్ధమైందని హనీఫ్ చెప్పాడు. రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ఎవరెవరు వచ్చే వారని విలేకరులు పలుమార్లు అడిగినప్పటికీ హానీఫ్ చెప్పలేదు. తాను కేవలం అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి పని చేసి వచ్చేవాడినని అంతకుమించి తనకు సంబంధం లేదన్నాడు. ఆమె ఇంటికి వచ్చే అమ్మాయిలు ప్రముఖులతో తనకెలాంటి సంబంధంలేదని అన్నాడు. తాను పని చేసినప్పుడే ఎంతో కొంత డబ్బు ఇచ్చేదని చెప్పాడు.
కాగా తారాచౌదరి అకౌంట్ల పైన దృష్టి సారించామని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. హనీఫ్ నుండి పోలీసులు స్పై కెమెరాలు ఫోటోలు వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మోడల్స్ తదితరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ సినీ ప్రముఖులు కూడా అందులో ఉన్నారని తెలుస్తోంది.
తారా చౌదరి బ్యాంక్ అకౌంట్లలో భారీగా డబ్బులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ డబ్బులు ఆమెకు ఎవరు ఇచ్చారు ఎక్కడి నుండి వచ్చాయి అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు సమాచారం. ఆమెతో ఎవరెవరి పాత్ర ఎంతో ఉందో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా హనీఫ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి విచారణ నిమిత్తం కస్టడీకి కోరే అవకాశముంది. తారా చౌదరి రిమాండ్ ఈరోజుతో ముగియడంతో పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపర్చగా మే 11 వరకు తారాకు రిమాండ్ విధించింది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Hanif, speaks, about, Tara, Political, Entertainment, Telugu
|