ఉపఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ వెనుకబడి ఉన్న మాట వాస్తవమేనని రాజ్యసభ సభ్యుడు సినీనటుడు చిరంజీవి ఒప్పుకున్నారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్ధుల విషయంపై తుది నిర్ణయం రావచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం విశాఖ వచ్చిన చిరంజీవి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కు మూడో స్థానమే అన్న విమర్శలకు చిరు.. తనదైన శైలిలో స్పందించారు.
ఎవరి వాదనలు వారికుంటాయన్నారు. తిరుపతి అభ్యర్థి కోసం తాను ఎవరిని సిఫార్సు చేయలేదని తన కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరని చిరు స్పష్టం చేసారు. రాజ్యసభ ఎంపిగా ఉన్న తనను మంత్రిగా చేయాలన్నది అధిష్టానం నిర్ణయమని ఈ విషయంలో ఎలాంటి డిమాండ్లు లేవనన్నారు.
గత ఎన్నికల్లో ఓటమి పాలైన పీఆర్పీ అభ్యర్థులను ఉపఎన్నికల కోసం పరిగణనలోకి తీసుకోవాలని ఆశిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. జూన్ 14న రామ్ చరణ్ వివాహం జరుగుతుందని 15న అభిమానలకు రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ram, charan, reception, on, june, 15th, Political, Entertainment, Telugu
|