బాలకృష్ణ పార్వతిమెల్టన్ ఇషాచావ్లా ప్రధానపాత్రధారులుగా ఆర్.ఆర్ మూవీ మేకర్స్ ఎల్లోఫ్లవర్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీమన్నారాయణ’. రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నిర్మాత పుప్పాల రమేష్ మాట్లాడుతూ తమ ద్వితీయ చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో సెనే్సషనల్ హిట్ అవుతుందని పద్మాలయలో వేసిన భారీ సెట్‌లో హీరోయిన్లతోపాటు అరవై మంది డాన్సర్లపై ఓ పాటను చిత్రీకరించామని జూన్‌లో యూరప్ ట్రిప్‌లో మూడు పాటలు మలేషియాలో ఓ ఫైట్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు. అడ్వంచర్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రం మాస్ క్లాస్‌ను ఆకట్టుకుంటుందని ఆరుగురు విలన్లతో హీరో చేసే టగ్‌ఆఫ్ వార్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు రవికుమార్ చావలి అన్నారు. సురేష్ విజయకుమార్ వినోద్‌కుమార్ కోట శ్రీనివాసరావు జయప్రకాష్‌రెడ్డి కృష్ణ్భగవాన్ ఆహుతి ప్రసాద్ ధర్మవరపు ఎమ్మెస్ నారాయణ రాజా రవీందర్ దువ్వాసి మోహన్ రావు రమేష్ నాగినీడు సుప్రీత్ సుధ సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం కెమెరా: టి.సురేందర్‌రెడ్డి సంగీతం: చక్రి ఎడిటింగ్: గౌతంరాజు నిర్మాత: పుప్పాల రమేష్ కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం: రవికుమార్ చావలి.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:srimannarayana, details, Political, Entertainment, Telugu
|