విజయవాడకు ర్యాలీగా వస్తున్న జగన్‌మోహన్ రెడ్డి వంగవీటి రాధాను మధ్యలో తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ కలిసి అభినందించడం జగన్ పార్టీ లో కు సంకేతంగా పరిగణిస్తున్నారు.
ఇది కాకతాళీయంగా జరిగిందని వంశీ చెబుతున్నప్పటికీ పరిశీలకులు దీన్ని కొట్టివేస్తున్నారు. వంశీ కూడా వైఎస్సార్ సీపీలో చేరే అవకాశాలున్నాయని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి శుక్రవారం జరిగిన సంఘటన బలం చేకూర్చుతోంది. ఎంత కష్టపడి పనిచేస్తున్నా.. పార్టీలో వంశీకి తగిన గుర్తింపు లేదని ఆ పార్టీ వర్గీయులే పేర్కొంటున్నారు.
చంద్రబాబు నాయుడి నుంచి జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు వరకు వంశీని పార్టీనుంచి సాగనంపే ఉద్దేశంతో పొమ్మనకుండా పొగపెడుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై సన్నిహితుల వద్ద పలు సందర్భాలలో వంశీ కూడా తన ఆవేదనను వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.
వంశీ గుడివాడ శాసన సభ్యుడు కొడాలి వెంకటేశ్వరరావు (నాని) వంగవీటి రాధా ముగ్గురూ మిత్రులు కావడంతో వారంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే రాధా శుక్రవారం జగన్‌మోహన్ సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు. మిగిలిన ఇద్దరు కూడా త్వరలో ఆయన బాటను అనుసరించే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:nani, vamshi, in, ysr, party, Political, Entertainment, Telugu
|