బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు నాలుగు సంవత్సరాల జైలుశిక్ష పడింది. 2001లో ఆర్మీ కాంట్రాక్టు ఇప్పించడానికి ఓ సంస్థ నుంచి లక్షరూపాయలు లంచం తీసుకుంటూ తెహెల్కా కెమెరాలకు చిక్కిన కేసులో ఢిల్లీ సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. జైలు శిక్షతో పాటు లక్షరూపాయల జరిమానా విధించింది. ఇవాళ ఉదయం వాదోపవాదనల అనంతరం లక్ష్మణ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని సీబీఐ తరపు న్యాయవాది వాదించగా... తనకు రెండు సార్లు గుండె ఆపరేషన్ అయినందున ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని లక్ష్మణ్ కోర్టును కోరారు. దీంతో కోర్టు అతనికి నాలుగేళ్ల శిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేసేందుకు లక్ష్మణ్ లంచం తీసుకున్నట్లు కోర్టు నిర్ధారించింది.కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నజగన్ కి ఎన్ని ఏండ్ల కారాగార శిక్ష వేస్తారేమో ?
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:bagaru, lakshman, vs, jagan, Political, Entertainment, Telugu
|