
ఎన్టీయార్ సినిమాలలో హైఎస్ట్ గ్రాసర్ ల లో బృందావనం సినిమా ఒకటి. ఎన్టీయార్ కాజల్ మరియు సమంతలు ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం “బృందావనం”.
ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ చెయ్యబోతున్నారు. తమిళనాడులో ప్రతిపక్ష నేత ఐన విజయ్ కాంత్ ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేశారు. ఈ చిత్రంతో విజయ్ కాంత్ కొడుకు షణ్ముగ పాండియన్ పరిచయమవనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం 2010లో మంచి విజయం సాదించిన చిత్రం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి విజయ్ కాంత్ ప్రముఖ దర్శకుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Arava, brindhavanam, Political, Entertainment, Telugu
|