సినీ హీరో మోహన్‌బాబుతో వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని మోహన్ బాబు నివాసానికి జగన్ స్వయంగా వెళ్లి సమావేశం కావడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఏమైనా మారుతాయా అనే చర్చకు తెరలేచింది. ఈ సమావేశంపై మోహన్ బాబు మీడియాతో స్పందించారు.
తమ మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చ జరుగలేదన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు మీడియాకు చెబుతానని అన్నారు. జగన్ బంధువుగానే కలిశారని చెప్పారు. మిగతా విషయాలు ఇపుడు వెల్లడించలేనన్నారు. కొద్దిరోజుల క్రితం విష్ణుకు కవల పిల్లలు పుట్టారని అందుకే జగన్ ఆయన సతీమణి భారతి చుట్టపు రూపంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారని చెప్పారు.
కాగా భేటీలో ఏం జరిగిందని రాజకీయంగా ఏమైనా సమీకరణాలు మారుతాయా అని విలేకరులు మోహన్ బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అందుకు ఆయన మీకు దండం పెడతాను మీరంతా నావాళ్లే తనకు షూటింగ్ పని ఉందని చెప్పి కారులో వెళ్లిపోయారు. కాగా జగన్ తన సతీమణి భారతితో కలిసి మోహన్ బాబు ఇంటికి వెళ్లారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:mohan, babu, in, jagan, party, Political, Entertainment, Telugu
|