బాలీవుడ్లో ట్రై యాంగిల్ లవ్ స్టొరీ ఎఫ్ఫెక్ట్ రాజ్యసభలో పడనుంది. నటి రేఖ రాజ్య సభ సీటు కు ఎంపి కైన విషయం తెలిసిందే. ఐతే జయాబచ్చన్ రేఖ రాజ్యసభలో ఎదురు పడితే ఎలా వ్యవహరిస్తారోననే విషయం ఫై ఊహాగానాలు వ్యక్త మవుతున్నాయి.
అయితే నామినేట్ అయిన 12 మంది సభ్యుల వరస జయ కూర్చునే సీట్ వెనుకే వుంటుంది . దాంతో రేఖ జయాబచ్చన్ వెనుక వరుసలో వస్తారు. ఆమెకు సన్నిహితంగా రేఖ కూర్చోవడం ఇష్టం లేని జయతన సీటు మార్చాల్సిందిగా చైర్మన్ హమీద్ అన్సారీని కోరినట్లు సమాచారం.
మహారాష్ట్రకు చెందిన ఒక రాజకీయ నాయకుడి సలహా మేరకు జయకు పోటీగా రేఖను నామినేట్ చేసి నట్లు తెలుస్తుంది.రేఖ రాజ్యసభకు ఎంపికైన విషయం జయకు ఇబ్బంది కలిగించే అంశమే.ఏదేమైనా జయాబచ్చన్ సీటు మార్పు విజ్ఞప్తిని చైర్మన్ మన్నిస్తారో లేదో చూడాలి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:http, and, and, andhravilascom, and, images, and, spacergif, Political, Entertainment, Telugu
|