కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడు మాజీ ఎమ్మెల్యే కె.చిరంజీవి తిరుపతితో శాశ్వతంగా విడాకులు తీసుకున్నారు. రాజకీయంగా ఉన్న చివరి అనుబంధానికి కూడా రాం రాం చెప్పారు. రాజ్యసభ ద్వారా మున్సిపల్ కౌన్సిల్‌లో ఎక్స్ అఫిషియోగా కొనసాగే అవకాశాన్ని తిరుపతి కార్పొరేషన్‌కు ఇవ్వలేదు. రాజ్యసభ సభ్యునిగా తనకు ఉన్న అవకాశాన్ని ఆయన గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్స్ అఫిషియో సభ్యత్వం కోసం ఆప్షన్ ఇచ్చారు. దీంతో తిరుపతి నగరంతో రాజకీయంగా ముడిపడేందుకు ఉన్న ఒక్కగానొక్క చివరి అవకాశాన్ని కూడా వదులుకున్నట్లు అయింది రాజ్యసభ సభ్యునిగా అయినా స్థానికంగా అందుబాటులో ఉంటారు. తిరుపతి కార్పొరేషన్‌లో ఎక్స్‌అఫిషియో సభ్యునిగా కొనసాగుతారనుకున్నారు. అరుుతే చిరంజీవి సినిమా ఫక్కీలో ప్రజలకు చేయిచ్చి తిరుపతివాసులకు అందకుండా రాజధానికే పరిమితం చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎక్స్‌అఫిషియో సభ్యునిగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందించారు. ఎంతైనా సినీనటుడు కదా... మన నాయకుడు మనకు కూడా చేయిచ్చాడే అని పూర్వ పీఆర్పీ నాయకులు ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు తెల్లముఖాలేస్తున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యునిగా తిరుపతి కౌన్సిల్‌లో ఉంటే అప్పుడప్పుడూ తిరుపతి వచ్చేవారు. ఒకటి అర సిఫార్సులు చేసుకోవటానికి వీలయ్యేది ఇప్పుడు అది కూడా పోరుుందే అని కాంగ్రెస్ నాయకులు లోలోన మధనపడుతున్నా
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:chiru, by, bye, to, tirupathi, Political, Entertainment, Telugu
|