ప్రముఖ సినీనటి నమిత తన కుటుంబ సభ్యులతో బుధవారం ఉదయం దర్శన విరామ సమయంలో శ్రీవారిని దర్శించు కున్నారు. అంతకు ముందు నమిత మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకుని పద్మావతి అతిథి గృహాల వద్ద బస చేసింది. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆమె ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. సినిమా అవకాశాల గురించి అడుగగా మంచి పాత్రలలో నటిస్తున్నానని చెప్పారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:namitha, visits, tirumala, Political, Entertainment, Telugu
|