తెలుగుదేశం నేతలు తొడలు చరిచి చరిచి వాచిపోయాయని వాటి వాపు ఇంకా తగ్గలేదని రోజా చేసిన వ్యాఖ్యలను తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టిఎన్‌ఎస్‌ఎఫ్) అధ్యక్షుడు నన్సూరి నర్సిరెడ్డి తప్పుబట్టారు. తమ పార్టీల నేతలు తొడల వాపు తగ్గిందీ లేనిదీ ఆమెకెలా తెలుసునని బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన ప్రశ్నించారు. రోజా మాట్లాడే విధానం బాగా లేదని ఆమె తన విమర్శనాపద్ధతులు మానుకోవాలని హెచ్చరించారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారంటూ 2009 ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న రోజా ఇప్పుడు జిల్లాలో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని చెప్పడం ఆమె రాజకీయ దివాళాకోరు తనమేనని దుయ్యబట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ పథకంలో మైండ్ బ్లాకై హెడ్ లైన్స్ డెడ్‌లైన్స్ కోసం మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు. తాను అధికారంలోకి వస్తే అది చేస్తా.. ఇది చేస్తా అంటూ వెళ్ళిన ప్రతిచోటా అక్కడి సమస్య ఫైలుపైనే మొదటి సంతకం చేస్తానంటూ జగన్ ఆడుతున్న డ్రామాలను ప్రజలు విశ్వసించరని అన్నారు. ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెదేపాదెనని వాటికి అదనంగా హామీలిస్తున్న చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్‌కు లేదన్నారు. ప్రతి ఊళ్ళో కొత్త ప్రాజెక్టు చేపడతానని ఆ ఊరి సమస్యల ఫైలుపైనే మొదటి సంతకం చేస్తానంటున్న జగన్ టోల్‌ఫ్రీ బాబాగా అవతారమెత్తుతున్నారని నర్సిరెడ్డి ఎద్దేవా చేశారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:tnsf, narsieddy, fire, on, roja, Political, Entertainment, Telugu
|