తిరుపతి నియోజకవర్గ ప్రజలను చిరంజీవి నట్టేట ముంచారని మాజీ మంత్రి హరిరామజోగయ్య ఆరోపించారు. స్థానికుల నమ్మకాన్ని వమ్ము చేసి ఢిల్లీకి వెళ్లడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. కాపులు చిరంజీవిని నమ్మే పరిస్థితి లేరని ఇక చిరు రాజకీయ భవిష్యత్తు అంధకారమేనని హరిరామజోగయ్య అన్నారు. ఇక కాపులపై ప్రదర్శిస్తున్న చంద్రబాబుది కపట ప్రేమ అని ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే బాబు నాటకాలాడుతున్నాడని ఆయన అన్నారు. వైఎస్ కుటుంబానికి అన్ని మతాలపై గౌరవం ఉందని శ్రీవారి దర్శనానికి వచ్చిన జగన్‌ను డిక్లరేషన్ పేరిట అవమానించడం బాధాకరమని మాజీ మంత్రి హరిరామజోగయ్య మీడియాకు తెలిపారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:hari, rama, jogayya, fire, on, chiru, Political, Entertainment, Telugu
|