మంత్రి గల్ల అరుణకుమారి తనయుడు జయదేవ్‌కు తిరుపతి టిక్కెట్ రాకపోవడం వెనుక చిరంజీవే ఉన్నారని ఆమె భావిస్తున్నారని అంటున్నారు. వెంకట రమణకు టిక్కెట్ కేటాయిస్తున్నారని తెలిసి మూడు రోజుల క్రితం ఆమె చిరంజీవి ఇంటికి వెళ్లి తన తనయుడికి టిక్కెట్ ఇప్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి స్థానం చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయినందున అక్కడి అభ్యర్థి ఎంపికలో పార్టీ అధిష్టానం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిందని అంటున్నారు. అంతే కాకుండా తిరుపతి సీటు ని గెలిపించే బాద్యత కుడా చిరు పైనే పెట్టారు.
ఒకపక్క పార్టీ లోనే మంత్రి గల్ల అరుణకుమారి అసంతృప్తి మరి వైపు తిరుపతి సీటు ని గెలిపించే బాద్యత వెరసి చిరు కి తిరుపతి తలనొప్పి గా మారిందని పార్టీ వర్గాలు వ్యక్యనిన్చుకుంటున్నాయి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Chiru, ki, tirupati, talanoppi, Political, Entertainment, Telugu
|