డమరుకం చిత్రాన్ని జూలై మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతున్నది. నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నది.
ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ హీరోయిన్ కీ శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేద్ధమనుకున్నపటికి గ్రాఫిక్స్ లేటవటంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:July, lo, moganunna, damarukam, Political, Entertainment, Telugu
|