రానా హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్సకత్వం లో తెలుగు 'ఒక్కడు' చిత్రాన్ని హిందీలో డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం రైట్స్ సి.కళ్యాణ్ దగ్గర ఉన్నాయని ఆయనే హిందీలో నిర్మించే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ప్రిన్స్ మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం ఒక్కడు. ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా గుణ శేఖర్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం రానా హీరో గా బాలీవుడ్ లో రీమేక్ కానుంది. ప్రస్తుతం వర్మ ఈ చిత్రం స్క్రిప్టుని హిందీకి మార్పులు చేర్పులతో రెడీ చేయిస్తున్నారు. ఇక ప్రస్తుతం రానా..వర్మ తీస్తున్న డిపార్టమెంట్ చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రంతో రానా బాలీవుడ్ లో గ్యారెంటీగా సెటిల్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ తో వరుస సినిమాలు చేయడం రానా కెరీర్ కి మంచి చేస్తుందో చెడు చేస్తుందో చూడాలి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Bollywood, okkadu, raana, Political, Entertainment, Telugu
|