గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే యూరప్ నుండి యూనిట్ సభ్యులు హైదరబాద్ చేరుకోగా శృతి హాసన్ ముంబై చేరుకున్నారు. ‘దిల్ సే’ పాట చిత్రీకరణతో ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయింది.
ప్రొస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. రేపు(మే 5) వరకు ఫస్ట్ కాపీ రెడీకానుంది. రేపు సాయంత్రానికల్లా ఈ కాపీ సెన్సార్ బోర్డు సభ్యుల చేతికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈచిత్రానికి ఎన్నికత్తెర్లు పడతాయి అనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ బాబు నిర్మించారు. అభిమానులకు ఆకట్టుకునేలా తీర్చిదిద్ధినల్టు యూనిట్ వర్గాలు చెబుతున్నారు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టిస్తుంది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Europe, nundi, vastunna, gabbar, sing, Political, Entertainment, Telugu
|