ఈ శీర్షిక సుడిగాడు సినిమాకి ట్యాగ్ లైన్. ఈ చిత్ర ఆడియో ఈ నెలలోనే విడుదల కానుంది ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చెయ్యాలని నిర్మాత భావిస్తున్నారు.
అల్లరి నరేష్ మోనాల్ గజ్జర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “సుడిగాడు” చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. కొన్ని ప్రముఖ చిత్రాలకు ఇది వ్యంగాస్త్రం కాబోతుంది. ఈ చిత్ర శీర్షిక కూడా “ఒక టికెట్ పై 100 సినిమాలు”. ఈ చిత్రం మొత్తం హైదరాబాద్ లో చిత్రీకరించారు.
భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.చంద్రశేఖర్ రెడ్డి అరుంధతి ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. శ్రీ వసంత్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:okka, ticket, pina, 100, cinemalu, Political, Entertainment, Telugu
|