కామాక్షి మూవీస్ పతాకంపై నాగార్జునతో మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి కింగ్ .
బాస్ సినిమా తరువాత నాగ్ తో నాయన తార జతకట్టనుంది. ఈ జంట అభిమానులకి కన్నుల పండగే అవ్వనుంది.
దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ క్లాప్ నివ్వగా హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని డిసెంబర్లో గానీ జనవరిలోగానీ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి లవ్ స్టొరీ అనే పేరుని రిజిస్టర్ చేసారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:naag, tho, 9taara, Political, Entertainment, Telugu
|