జగన్ నేర చరిత్రను ప్రజలు తెలుసుకోవాలని జగన్ ఓ గూండా అని ఆయనకు కేవలం డబ్బు పదవి మీద మాత్రమే కోరిక ఉందని తాను ఇప్పటి వరకు భావించానని కానీ మనుషులను కూడా చంపే ఆలోచన కూడా అతనికి ఉందని ప్రజలు తెలుసుకోవాలని జగన్ పైన విహెచ్ ఆదివారం తన నివాసంలో నిప్పులు గక్కారు. భాను కిరణ్ ఆఫ్రికాలో కూడా సెటిల్మెంట్లు చేశాడంటే మన పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. భానుతో సంబంధాలపై జగన్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. జగన్ సన్నిహితుడు మంగళి కృష్ణకు తాను డబ్బులు ఇచ్చినట్లు భాను విచారణలో ఒప్పుకున్నారన్నారు. దీనిపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
జగన్‌కు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వంటి దేవుడిపై భక్తి లేదని విమర్శించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం 1923లో బ్రిటిష్ హయాం నుండే అమలు పరుస్తున్నారన్నారు. కానీ జగన్ మాత్రం అక్కడ శ్రీవారిని కాదని తనకు జిందాబాద్‌లు కొట్టించుకున్నారని మండిపడ్డారు. దేవుడితో నీచ రాజకీయాలు చేస్తుంది జగనే అని ఆరోపించారు. ఆ రాజకీయాలు రాష్ట్రంలో ప్రారంభించిందే జగన్ అంటూ విరుచుకుపడ్డారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Raktham, marigina, jaganVH, Political, Entertainment, Telugu
|