‘రచ్చ’ చిత్రం ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ టీవీ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ కార్యక్రమంలో చరణ్ తమన్నాతో మాట్లాడుతూ...తమన్నాతో చేసిన పెళ్లి కాని హీరోలంతా పెళ్లి పీటలెక్కుతున్నారని హీరో కార్తీ దగ్గర నుంచి నా వరకు అందరి పరిస్థితి అలాగే అవుతోందని.... తమన్నాను ఆటపట్టిస్తున్నాడు రామ్ చరణ్.
కార్తితో కలిసి ‘సిరుతై’ చేశావ్ అదే టైమ్‌లో అతని పెళ్లయిపోయింది. ఎన్టీఆర్‌తో కలిసి ‘ఊరసవెళ్లి’ చేశావ్. సరిగ్గా అదే టైమ్‌లో తారక్ కూడా పెళ్లి పీటలెక్కేశాడు. అలాగే బన్నీ ‘బద్రీనాథ్’ చేశావ్. అతని పెళ్లి కూడా ఆగిపోయింది. ఇప్పుడునాతో ‘రచ్చ’ చేశావ్. త్వరలో నా పెళ్లి కూడా అయిపోతోంది. దీని బట్టి ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే నీతో కలిసి నటిస్తే సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అలానే నీ పెళ్లి జరుగాలంటే... రాణాతో నటించు. ఇప్పటికే అతనితో చేసిన జెనీలియాకు పెళ్లియిపోయింది అంటూ చెప్పాడు. దీనితో తమన్నాతో చేస్తే హీరోలకి రాణాతో చేస్తే హీరోయిన్ కి పెళ్లి కుదురుతుందని టాలీవుడ్ వర్గాలు కూడా సరదాగా వ్యాఖ్యానిన్చుకుంటున్నాయి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:tamannatho, chesthe, herolaki, rana, tho, chesthe, heroiene, ki, pelli, kuduruthundha, Political, Entertainment, Telugu
|