సిగ్నేచర్ స్టెప్స్ స్పెషలిస్ట్ జానీ కొరియోగ్రాఫిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ చేయనున్నాడు. ‘జులాయి’ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ నెల 9వ తేదీ నుండి ఈ పాట చిత్రీకరించనున్నారు.
జానీ మాస్టర్ ఇటీవలే ‘రచ్చ’ సినిమాలో డిల్లకు డిల్లకు అనే పాటకి కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే దుబాయ్ లో పాటల చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఇలియానా హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ నెల రెండవ వారం లో పాటలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మంచి అంచనాల నడుమ ఈ చిత్రం రూపొందుతున్నది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:signature, steps, specialist, jhony, koreography, lo, allu, arjun, Political, Entertainment, Telugu
|