జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) సోమవారం మరో అదనపు ఛార్జీషీటును కోర్టులో దాఖలు చేసింది. ఈ కేసులో ఇది మూడో ఛార్జీషీట్. తాజా ఛార్జీషీటులో సిబిఐ ఆరుగురి పేర్లను నిందితులుగా చేర్చింది. ఎ-1గా జగన్ ఎ-2గా విజయ సాయి రెడ్డి ఎ-3గా జగతి పబ్లికేషన్స్ ఎ-4గా ఐఏఎస్ వెంకట్రామి రెడ్డి ఎ-5గా అయోధ్య రెడ్డి ఎ-6గా రాంకీ ఫార్మా సిటీ లిమిటెడ్‌లను నిందితులుగా చేర్చింది. 88 పేజీలతో 148 అనుబంధ డాక్యుమెంట్లతో 72 మంది సాక్షుల పేర్లను ఛార్జీషీట్‌లో ప్రస్తావించింది. సిబిఐ ఇప్పటికే మొదటి ఛార్జీషీటుతో పాటు ఇటీవల మొదటి అదనపు ఛార్జీషీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. తొలి ఛార్జీషీట్‌లో పదమూడు మందిని నిందితులుగా పేర్కొన్న సిబిఐ తాజా ఛార్జీషీట్‌లో ఆరుగురిని పేర్కొంది. అందులో ఎ-1గా వున్నా జగన్ ని సిబిఐ కోర్ట్ కి హాజరవ్వాలని ఈ రోజు ఆదేశం జారి చేసినది. ఉప ఎన్నికలు నేపద్యంలో కోర్టు ఆదేశం తో వై ఎస్ ర్ సి పి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:jagam, ni, cbi, court, ki, hajaravvalani, adesam, Political, Entertainment, Telugu
|