పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రంపై మరో వివాదం నెలకొంది. గబ్బర్ సింగ్ చిత్రంపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ధరించిన డ్రెస్సు అతని పాత్ర పోలీసుల కించ పరిచేలా ఉందని వెంటనే అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు చలపతిరావు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మంత్రి బొత్సాకు బినామీగా ఉంటూ ఆడబ్బుతో గబ్బర్ సింగ్ చిత్రం నిర్మించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సెన్సార్ వాయిదాల మీద వాయిదాలు పడటం ఇప్పుడు కొత్తగా ఈ వివాదం నెలకొనడం తో పవన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:maro, vivadam, lo, chikkukunna, gabbar, sing, Political, Entertainment, Telugu
|