అల్లరి నరేష్ పరిశ్రమకి పరిచయమయ్యి పది సంవత్సరాలు అయినది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ 3డి చిత్రం “యాక్షన్” చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 15 నుండి ఈ చిత్ర రెండవ షెడ్యూల్ చిత్రీకరణ మొదలు కానుంది. సుంకర రామ్ బ్రహ్మం ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు బప్పి లహరి తనయుడు బప్పా లహరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు తమన్ నేఫధ్య సంగీతం అందిస్తున్నారు. పది సంవత్సరాలుగా ఆంద్ర ప్రేక్షకులు నరేష్ చేసే అల్లరి చూసి తమ బాధలను మరిచిపోతున్నారు. ఆ అల్లరకి అప్పుడే పదేళ్ళా అని ఆశ్చర్యపోతున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:aa, allarfiki, appude, padella, Political, Entertainment, Telugu
|