
దబాంగ్ రీమేక్ గా వచ్చినా... సినిమాలో చాలా భాగం కథ కథనం మార్చి.. హరీష్ శంకర్ తన కలం బలం చూపించి మాస్ ని మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసాడు. బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్‌గా వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఒరిజనల్ స్టోరీలైన్ .. కొన్ని కీ సీన్స్ మాత్రం తీసుకుని చేసుకున్న కథ. ముఖ్యంగా అజయ్ పాత్రను తగ్గించి అతని లవ్ స్టోరీని తీసేయటం విలన్ పాత్ర నిడివి పూర్తిగా పెంచటం ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఫైట్ కూడా దబాంగ్‌లో లేనిది క్రియేట్ చేయటం బాగా ప్లస్ అయ్యింది. అలాగే సినిమా ప్రారంభంలో షోలో చిత్రంలోని గబ్బర్ సింగ్ పాత్రతో సినిమాను ప్రారంభించటంతో హీరో క్యారెక్టర్ కి డెప్త్ వచ్చింది. చిన్నప్పుడు షోలే సినిమా తెగ చూసి అందులో గబ్బర్ సింగ్ పాత్రను విపరీతంగా ప్రేమించి తన పేరుని గబ్బర్ సింగ్ గా మార్చుకున్న పోలీస్ అధికారి వెంకటరత్నం నాయుడు పాత్రను పవన్ అద్బుతంగా పోషించారు. పవర్ స్టార్ తనదైన శైలిలో ఫైట్స్ స్టైప్స్ తో గబ్బర్ సింగ్ పాత్రను ఆకలి తో వున్నా పులి కి సరైన ఆహరం దొరికితే ఏమి చేస్తుందో అలా దొరికిన ఈ పాత్రను చేసాడు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Gabbar, sing, daban, remake, kaadaa, Political, Entertainment, Telugu
|