ఉప ఎన్నికలకు ముందే వైయస్ జగన్‌ను అష్టదిగ్బంధం చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ చకాచకా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మరో ఆరు చార్జిషీట్లు దాఖలు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే జగన్‌ను అరెస్టు చేయడం జగన్ ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలపై కీలక చర్చలు జరుగుతున్నాయని వార్తకథానాలు ప్రసరమవుతున్నాయి.
ప్రస్తుతం జగన్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య తిరుగుతున్నారని ఈ పరిస్థితిలో జనం మధ్య అరెస్టు చేసినట్లయితే చిక్కులు ఎదురుకావచ్చని 28న జగన్ ఎలాగూ కోర్టుకు హాజరవుతారని అప్పుడు న్యాయస్థానాన్ని కోరి కస్టడీలోకి తీసుకుంటే సరిపోతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. జరుగుతున్న పరిణామాల నేపద్యంలో వై.కా.పా నేతలు ఆందోళనకు గురి అవుతున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Astadhigbandanam, lo, jagan, Political, Entertainment, Telugu
|