సినిమాలలో జేజే లందుకుని రాజకీయాలలో విమర్సల పాలవుతున్న చిరుకు మరొ సమస్య చుట్టుకోనున్నది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నివాసంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐటి అధికారులు కీలక పత్రాలను మరియు ఐటి అధికారులు భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుస్మిత నివాసంలో ఆదాయం పన్ను ఎగవేశారనే సమాచారంతోనే సుస్మిత నివాసంపై ఐటి శాఖ అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 12 మంది అధికారులతో కూడిన బృందం సుస్మిత నివాసంలో సోదాలు జరిపింది. సుస్మిత భర్త విష్ణు ప్రసాద్‌ను ఐటి అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. త్వరలో తిరుపతి నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపద్యం లో ప్రత్యర్డులు ఈ ఐటి దాడులని తనకి ముడిపెడతారేమో అని చిరు ఆందోళన చెందుతున్నారని సమాచారం.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Chiru, ki, maro, talanoppi, Political, Entertainment, Telugu
|