ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే చిత్రాన్ని మంచు లక్ష్మి ప్రసన్న నిర్మిస్తున్నది. భారీ బడ్జెత్ తో రూపొందుతున్న ఈచిత్రంలో నటసింహం బాలయ్య జమిందార్ నరసింహ రాయుడుగా పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రూ. 6.5 కోట్లతో గాంధర్వ మహల్ సెట్టింగ్ వేయడం ఇప్పుడు పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి లోను చేస్తోంది. ఐతే లక్ష్మి తన తండ్రి మోహన్ బాబును ఈ షూటింగుకు కావాలని దూరం పెట్టినదట. దీనికి కారణం గాంధర్వ మహల్ సెట్టింగ్ కోసం అంత ఖర్చు పెట్టడం మోహన్ బాబు కి ఇష్టం లేదట. అయితే మంచు లక్ష్మి నమ్మకం అంతా సినిమా కథ స్ర్కిప్టుపైనే నంట. అందులో అంత దమ్ముంది కాబట్టే ఖర్చుకు వెనకాడటం లేదంటున్నారు. దీనితో ఊ కొడతారా ఉలిక్కి పడతారా సెట్టు చూసి మోహన్ బాబు ఉలిక్కిపడ్డారా అనుకుంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Mohan, babu, ullikki, paddara, Political, Entertainment, Telugu
|