A 1 నిందితుడిగా సిబిఐ ఛార్జ్ షీట్ నమోదు చేసిన జగన్‌కు కోర్టు సమన్లు అందజేయడంలో ఎట్టకేలకు సిబిఐ అధికారులు విజయం సాధించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని చెన్నకేశవ రెడ్డి నివాసంలో సిబిఐ అధికారులు జగన్‌ను కలిశారు. అక్కడే ఆయనకు సమన్లు అందజేశారు. ఆస్తుల కేసులో ఈ నెల 28వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు తమ ముందు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని వైయస్ జగన్ ఇటీవల జాతీయ మీడియాతో చెప్పారు. ఐనప్పటికీ జగన్ కి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతో సిబిఐ అధికారులు స్వయం గ వెళ్లి సమన్లు అందజేసారూ. మే28 న జగన్ హై కోర్ట్ లో హజరైనప్పుడు అరెస్ట్ చెయ్యవచ్చుననే పదంతుల నేపద్యం లో వై.కా.పా నేతలు అన్దోలనలో వున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Samanlu, svikarinchina, A1, jagan, Political, Entertainment, Telugu
|