తన పెళ్లి పుకార్లను అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా ఖండిన్చారు.అల్లు శిరీష్ త్వరలో ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడని రాబోయే ఏడాది వీరి పెళ్లి ఉండబోతుందని ఇరు కుటుంభాలు ఈ పెళ్ళికి అంగీకరించాయని పుకార్లు పలు మీడియా వారు ప్రచురించారు. దీనికి స్పందనగా అల్లు శిరీష్ ఇలా ట్వీట్ చేశారు “నాకు ఇంకొక మూడు నాలుగేళ్ళ వరకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నన్ను ఇలా ఉండనివ్వండి ఆ అమ్మాయి నాకు సోదరి వంటిది ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పండి గతంలో కూడా ఇలానే అన్నారు నాకు దీనివల్ల పోయేదేమీ లేదు కాని ఆ అమ్మాయి గురించి కాస్త ఆలోచించండి ఇలాంటి విషయాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించండి” అని అన్నారు. త్వరలో హీరో గా ప్రమోట్ అవుదామనుకుంటే ఈ చికాకు అనుకున్టున్నట్లున్నాడు శిరీష్.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Appude, naku, pella, Political, Entertainment, Telugu
|