
నట సింహం నందమూరి బాలకృష్ణ రవి కుమార్ చావాలి దర్శకత్వం లో నటిస్తున్న శ్రీమన్నారాయణ లో బాలకృష్ణ తన కలం బలం చూపించనున్నారు.ఈ చిత్రం లో ఒక పత్రిక లో విలేఖరి పాత్రలో కనిపించబోతున్నారు . రవి కుమార్ చావాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇషా చావ్లా మరియు పార్వతి మెల్టన్ లు కథానాయికలుగా నటిస్తూన్నారు.
దర్శకుడు రవి కుమార్ చావాలి మాట్లాడుతూ “సమాజంలో మార్పు తెచ్చేంత శక్తి కలంకి మాత్రమే ఉంది. ఈ చిత్రం లో హీరో కలం ఉపయోగించి సమాజంలో ఎలా పరివర్తన తీసుకొచ్చాడో చూపిస్తున్నాము ఇందులో బాలకృష్ణ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది” అని అన్నారు. ఎల్లో ఫ్లవర్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని రమేష్ పుప్పల నిర్మిస్తున్నారు ఆర్ ఆర్ మోవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Kalam, balam, choopinchanunna, balayya, Political, Entertainment, Telugu
|