
బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్సకత్వం లో తెరకెక్కిస్తున్న చిత్రం 'అధినాయకుడు'. ఈ చిత్రాన్ని ఈ నెల 31 విడుదల చేయటానికి తేదిని ఫిక్స్ చేసారని సమాచారం.చాలా సార్లు రిలీజ్ డేట్లు మారిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 31 విడుదల కన్ఫర్మ్ అయినది.
అయితే ఈ నెల 30న అంటే అధినాయకుడు సినిమా కంటే ఒక రోజు ముందు రాజమౌళి ఈగ చిత్రం విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఏ చిత్రం ఎవరికి పోటి అవుతుందనే విషయం చర్చనీయాంసమైంది. ఒక్క రోజు తేడాలో రెండు పెద్ద చిత్రాలు రిలీజు అయితే ధియోటర్స్ సమస్య మాత్రమే కాక రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఆ ఎఫెక్టు కలెక్షన్స్ మీద కూడా పడుతుందని అంటున్నారు. ఐతే ఈ ఎఫెక్టు ఎవరిమీద పడనుందో చూడాలి. ఈగ రిలీజ్ తరువాత రోజే అధినాయకుడు రిలీజ్ అవుతుండడంతో ఈగ మీదకి అధినాయకుడు దాడి చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Eega, meedaki, daadi, cheyyanunna, adhinayakudu, Political, Entertainment, Telugu
|