రామ్ చరణ్ లగ్నపత్రికను గురువారం బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సతీమణి సురేఖ తన కుమారుడు రామ్ చరణ్ లగ్న పత్రికను తీసుకుని ఇంద్ర కీలాద్రికి చేరుకున్నారు. ఆమెకు దేవస్థానం ఇవో రఘునాథ్ స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకుని వెళ్లారు.
దుర్గమ్మ పాదాల చెంత లగ్న పత్రికను ఉంచి సురేఖ పూజలు చేశారు. అ తర్వాత ఆమె తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఉపాసన కామినేనితో రామ్ చరణ్ వివాహం జూన్ 14వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:cherry, wedding, invitation, at, indrakiladri, Political, Entertainment, Telugu
|