రజనీకాంత్ నటిస్తున్న ‘కోచడయాన్’ చిత్రంకి ‘విక్రమసింహా’ అనే పేరును ఖరారు చేశారనేది సమాచారం. సౌందర్య దర్శకత్వంలో ఓ భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త గెటప్‌లో రజనీ కనిపించనున్నారు. సినిమా గురించి దర్శకురాలు రజని కూతురు సౌందర్య మీడియాతో మాట్లాడుతూ.. ''కోచడయాన్' సాధారణ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి వాటిలో నటించడం అంత సులభం కాదు. సవాల్‌తో కూడుకున్న విషయం. ఊహకే అంతుచిక్కని లొకేషన్లు ఇందులో కనిపించడం విశేషం. ఇదో ఫాంటసీ సినిమా. కేవలం పిల్లల్నే గాక అందర్నీ ఈ సినిమా ఆకర్షిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 13న విడుదలవుతుంది''అని తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే అవకాశాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ అధినేత బి.సుబ్రహ్మణ్యం దక్కించుకున్న విషయం తెలిసిందే.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Vikrama, simha, gaa, ranunna, rajanikanth, Political, Entertainment, Telugu
|