ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను హత్యా నేరం కింద ఒంగోలు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు మాఫీ కోసం పోలీసులకు లంచం ఇవ్వ జూపినందుక్కూడా ఆయనపై కేసు నవెూదు చేశారు. సోమవారం తెల్లవారు జామున ఆయన్ని ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించారు. పోలీసులు ఆయన్ని వైద్య పరీక్షల అనంతరం జిల్లా జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. 2010లో కేఏ పాల్ సోదరుడు డేవిడ్ రాజు అనుమానాస్పద స్థితిలో మహబూబ్ నగర్ జిల్లాలో మృతి చెందాడు. ఆస్తి వివాదాల కారణంగా చంపించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై కేసు దర్యాప్తు జరుగుతుండగా.. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి తనను చంపుతానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు పాల్ ఫిర్యాదు చేశాడు. దీనిపై ఒంగోలు రూరల్ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. కోటేశ్వరరావు వద్ద కొన్ని సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాల్ తన సోదరుడ్ని హతమార్చడానికి రూ.50 లక్షలు బేరం కుదుర్చుకున్నట్లు కోటేశ్వరరావు వెల్లడించినట్లు పోలీసు వర్గాల సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించి తనకు ఇంకా కొంత నగదు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వకుండా వేధిస్తున్నట్లు కోటేశ్వరరావు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీనిపై పాల్‌ను పోలీసులు ప్రశ్నించారు. అతని సోదరుని హత్యకు పాల్‌కు ఉన్న సంబంధం గురించి పోలీసులు నిలదీశారు. దీంతో కోటేశ్వరరావును ఎన్‌కౌంటర్ చేసి తనపై కేసు లేకుండా చేస్తే కోటి రూపాయలు ఇస్తానని పోలీసులను మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. దీన్ని కూడా పోలీసులు స్పై కెమెరాతో చిత్రీకరించారు. చివరకు పాల్ కటకటాలపాలయ్యారు. ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ వల్ల నష్టమని భావించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ కుట్ర పన్ని తనను కేసులో ఇరికించారని పాల్ ఆరోపిస్తున్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ka, paul, fire, on, jagan, Political, Entertainment, Telugu
|