నలువైపుల దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్న వైఎస్ జగన్‌ను ఆయన బాబాయి వివేకానందరెడ్డి బాసటగా నిలవనున్నారా? వివేకా కాంగ్రెస్‌ను వీడి జగన్‌పార్టీ పంచన చేరనున్నారా? కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. తన ముఖ్య అనుచరులతో సోమవారం పులివెందులలో వివేకా అత్యవసరంగా స మావేశమయ్యారు. ఇందులో ఆయన కీలక నిర్ణయాన్ని దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కడపకు వచ్చినప్పుడు వివేకాకు గుర్తింపునివ్వడం లేదని... ఇలా అయితే పులివెందులలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని ఆయన వర్గీయులు లోగడ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనితోపాటు ఇటీవల నెలకొన్న కొన్ని పరిణామాలతో కాంగ్రెస్‌లో కొనసాగడంపై వివేకా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోం ది. తండ్రి వైఎస్ రాజారెడ్డి వర్ధంతి అయిన ఈ నెల 23న వివేకా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని ఆరోజు వీలుపడని పక్షంలో 28న ప్రకటిస్తారని తెలుస్తోం ది.
జగన్ కాంగ్రెస్‌ను వీడి సొంత కుంపటి పెట్టుకున్నప్పటికీ వివేకా మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తొలు త ప్రకటించారు. తర్వాత వైఎస్ఆర్ మరణంతో ఖాళీ అ యిన పులివెందుల ఉప ఎన్నికలో ఏకంగా ఒదినపైనే పో టీకి దిగారు. ఆ సందర్భంగానే మంత్రి పదవికి రాజీనామా చేశారు. పులివెందులలో ఓటమి తర్వాత పార్టీతో ఆయనకు అంతరం పెరుగుతూ వచ్చింది. రాజ్యసభ సీటు కోసం గట్టిగా ప్రయత్నించినప్పటకీ ప్రయోజనం ద క్కలేదు. దీంతో మరింత దూరం పెరిగింది. ఇదే సమయంలో మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు అనివార్యం కావడం ఆయా నియోజకవర్గాలకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో వివేకాకు చోటు కల్పించకపోవడంతో ఆయనతోపాటు ఆయన వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆ సమయంలోనే ఆయన వర్గీయులు బొత్సను నిలదీశారు. సోదరుడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై సీఎం సహా కొందరు శాసనసభ్యులు చేసిన ఆరోపణలు జగన్ మీడియాపై దాడులు మరింత ఆందోళన కలిగించినట్లు వివేకా తనవర్గీయుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:viveka, in, ysr, congress, party, Political, Entertainment, Telugu
|