అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద ఘోరరైలు ప్రమాదం జరిగింది. హంపీ ఎక్స్‌ప్రెస్ కర్ణాటకలోని హంపీ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే రెండు బోగీల్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆగి ఉన్న గూడ్స్ రైలు ట్రాక్‌లోనే హంపీ ఎక్స్‌ప్రెస్‌కు కూడా రైల్వే సిగ్నల్‌మెన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 20 మంది మృత్యువాత పడ్డారు. మరో ఏబది మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడ్డవారిని పెనుగొండ బెంగళూరు ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స నందిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
హంపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోన్న బాధితులకు రైల్వే శాఖ నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు నష్టపరిహారం చెల్లిస్తామని ఆ శాఖ వెల్లడించింది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Andhra, Pradesh, train, accident, 14, dead, 25, injured, many, feared, trapped, Political, Entertainment, Telugu
|