వాన్‌పిక్‌కు భూముల కేటాయింపు వ్యవహారంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణను సీబీఐ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టు తెలుస్తోంది. నిన్న ఏడు గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ రోజూ కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. రెండో రోజూ విచారణకు హాజరయిన మంత్రిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో అవినీతి ఆరోపణలతో సీబీఐ అరెస్ట్ చేసిన తొలి మంత్రి మోపిదేవి కావడం గమనార్హం
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:mopidevi, arrest, Political, Entertainment, Telugu
|