సీబీఐ అధికారుల ముందు రేపు మరోసారి హాజరవుతున్నట్టు వైఎస్సార్ జగన్ తెలిపారు. ఈరోజు విచారణ ప్రశాంతంగా సాగిందని సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానని వాళ్లు అడిగిన వివరాలన్ని తెలిపానని ఆయన పేర్కొన్నారు.క్రిక్కిరిసిన మీడియా ప్రతినిధులతో నాలుగు మాటలు మాట్లాడి అక్కడి నుంచి నిష్క్రమించారు.
ఆంగ్లంలో మాట్లాడిన జగన్ సీబీఐ సందేహాలను నివృత్తి చేశానని చెప్పుకొచ్చారు. మరికొన్ని అంశాలలో క్లారిఫికేషన్ కోసం ఆదివారం సీబీఐ మరోసారి హాజరు కావాలని చెప్పిందన్నారు. ఆ తర్వాత అన్యమనస్కంగా అభివాదం చేసి వాహనంలోకి ప్రవేశించారు. దీనితో జగన్‌కు చెందిన రెండు వ్యక్తిగత వాహనాలు ఆ ముందు పోలీసు ఎస్కార్టు వాహనం రోడ్డు వెంట పరుగులు తీశాయి. జగన్‌ను ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు తొక్కుకుని తోసుకుని పోటీపడ్డా ఫలితం లేకపోయింది. మొత్తం మీద వచ్చిన మార్గంలోనే జగన్ లోటస్‌పాండ్‌లోని తన నివాసం చేరుకున్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ys, jagan, Political, Entertainment, Telugu
|