అక్రమాస్తుల కేసులో సీబీఐ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఉద్వేగంగా మాట్లాడారు. తన భర్త వైఎస్సార్ మృతిపై ఇంకా అనుమానాలున్నాయనీ తన భర్తను చంపారనీ ఇప్పుడు తన బిడ్డను హింసిస్తున్నారని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జగన్‌ను ఏం చేయదలచుకున్నాయంటూ కన్నీళ్ల పర్యంతమవుతూ ప్రశ్నించారు.
అసలు జగన్ చేసిన తప్పేమిటి..? ఓదార్పు చేయడమే తప్పా..? తండ్రి చనిపోయినప్పుడు ఆయన మరణవార్తను తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను జగన్ బాబు ఓదార్చడం తప్పా.. కాంగ్రెస్ అధిష్టానం మాట విననందుకే ఈ వేధింపులా..? అంటూ ప్రశ్నించారామె.
పార్టీలో ఉన్నప్పుడు అతడిని ప్రశాంతంగా ఉండనీయలేదు. పార్టీని విడిచి కొత్త పార్టీ పెట్టుకుని కుటుంబాలను ఓదార్పుకు వెళుతుంటే ఒకటే వేధింపులు నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఆధారాలు లేకుండా తన బిడ్డ జగన్ మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆమె ధ్వజమెత్తారు. మోపిదేవిని ఇలా అరెస్టు చేసి అలా ఆస్పత్రికి తరలించారని అన్నారు.
ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డిపై ఎందుకింత కక్ష అంటూ వాపోయారు. అనంతరం దిల్ కుషా గెస్ట్ హౌస్ ముందు ధర్నాకు కూర్చున్నారు. పోలీసుల అక్కడ్నించి వెళ్లిపొమ్మని చెప్పినా వినకుండా వారితో వాగ్వాదానికి దిగారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:vijayamma, fire, on, sonia, Political, Entertainment, Telugu
|