తనపై ఎవరైనా ఏ విషయంలోనైనా ఆరోపణ చేస్తే తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. మద్యం అంశంలో తనపై ఆరోపణలు వస్తే సిబిఐ తో విచారణ జరిపించాలని లేఖ రాశానని తానెక్కడా వెనక్కు తగ్గలేదని అన్నారు. వైఎస్‌ను ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తానేమైనా చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చినప్పుడు తమ నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. ఆర్థిక లావా దేవీలపై జగన్‌ను సిబిఐ విచారిస్తుంటే కాంగ్రెస్‌ను వైఎస్ విజయమ్మ విమర్శించడాన్ని ఆయన ఖండించారు. జగన్‌పై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పకుండా మిగతా వాటి గురించి మాట్లాడటం ఎంతవరకు న్యాయ మన్నారు. జగన్ మాదిరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడలేదన్నారు. మోపిదేవి వెంకటరమణ ఎలాంటి తప్పుచేయలేదని విశ్వసిస్తున్నానన్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:bosta, comments, on, vijayamma, Political, Entertainment, Telugu
|