ఊ కొడతార ఉలిక్కి పడతార చిత్రం ఆడియో వేడుకలో ‘ కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు’ మాట్లాడుతూ “ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ పాత్ర చూసి బాలయ్య మీద అసూయ కలిగిందన్నారు. ఎంతో అనుభవం ఉన్న బాలయ్య బాబు ఈ చిత్రం లో చాలా విభిన్నమైన పాత్ర పోషించారు అని చెప్పారు.ఈ చిత్రం తెరకెక్కించిన విధానం చాలా ఆనందం కలిగించిందని అన్నారు. బాలయ్య బాబు పాత్ర అద్భుతం గా ఉంటుందని అలాంటి మంచి పాత్ర తనకు రాలేదని బాడగా కూడా వున్నదని అన్నారు. ఈ చిత్రం ఒప్పుకొని ఎంతో గొప్పగా రావడానికి సహకరించిన బాలయ్య బాబు కి కృతఙ్ఞతలు తెలియజేసారు. తన తనయుడు మంచు మనోజ్ ని పేరు ప్రఖ్యాతలున్న హీరోగా ఎదిగేలాగా ఆశీర్వదించమని బాలయ్య బాబు ని కోరారు. దానికి బాలయ్య మనోజ్ మంచి నటుడని ఖచ్చితంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప నటుడిగా వేలుగొందుతాడని అన్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Balayya, ante, asuya, padutunna, kalekshan, king, Political, Entertainment, Telugu
|