ఊ కొడతార ఉలిక్కి పడతార చిత్రం ఆడియో వేడుకలో బాలయ్య బాబు మాట్లాడుతూ ఈ చిత్రం లో తను నటించడం చాల ఆనందంగా ఉందన్నారు. తెలుగు వారు వైవిధ్యాన్ని ఆదరిస్తారని అన్నారు. ఈ చిత్రం లో నాకు ఒక్క పాట కూడా లేదు ఐనప్పటికీ నా పాత్ర అద్బుతం అన్నారు. కచ్చితం గా ఈ చిత్రం విజయం సాదిస్తుందని అన్నారు.నటన అంటే కేవలం నవ్వడమో ఏడవడమో నవ్వు విసరదమో కాదని అంటూ చురకలు వేసారు.
తన కుటుంబానికి మోహన్ బాబు గారి కుటుంబానికి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉందన్నారు. దర్శకుడు రాజ తన పాత్రని తీర్చిదిద్దన విదానం చాల బాగుందని చాలా ఉత్సాహంగా ఈ పాత్ర లో నటించానని చెప్పారు. మనోజ్ మంచి నటుడని ఖచ్చితంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప నటుడిగా వేలుగొందుటాడని అన్నారు.ఈ చిత్ర ఆడియో వేడుకకి చిత్ర రంగం లోని ప్రముఖులు డా.దాసరి నారాయణ రావు కె.రాఘవేంద్ర రావు బి.గోపాల్ నవదీప్ నాని శర్వానంద్ రాజ నిఖిల్ తాప్సీ వంశీ ఫైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి బొబో శశి సంగీతాన్ని అందించారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Naaku, Political, Entertainment, Telugu
|