1992లో జరిగిన త్రికోణ ప్రేమకథగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అందాల రాక్షసి” ఆడియో విడుదల నిన్న రాత్రి అన్న పూర్ణ స్టూడియోస్ లో జరిగింది. వారాహి ఫీచర్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు.
పూర్తిగా కొత్త వాళ్ళు నవీన్రాహుల్ మరియు లావణ్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఆడియో విడుదలకి డి.రామానాయుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎం ఎం కీరవాణి బూరుగుపల్లి శివరామ కృష్ణగుణ్ణం గంగరాజు మరికొంతమంది ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేశారు.రాజమౌళి మాట్లాడుతూ “సాయి మంచి తృష్ణ ఉన్న నిర్మాత అయన నాకు గత ఆరు సంవత్సరాలుగా తెలుసు మాములుగా నిర్మాతలంటే చిత్రాన్ని బిజినెస్ లాగా చూస్తారు కాని సాయి కి చిత్రం అంటే కథ ఈ చిత్ర కథ గురించి సాయి చాలా నమ్మకంగా ఉన్నారు ఐదేళ్ళ క్రితం చంద్రశేకర్ ఏలేటి హను ని నాకు పరిచయం చేశారు అప్పుడు గమనించలేదు కాని ఎయిడ్స్ మీద అతను చేసిన యాడ్ నన్ను చాలా బాగా ఆకట్టుకుంది హను ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి దర్శకుల్లో ఒకరవుతారు” అని అన్నారు. ఈగ సినిమా రూపొందిన వారాహి ఫీచర్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఈ సినిమా రూపొందడం తో మంచి అంచనాలు వున్నాయి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Andala, rakshasi, trikona, prema, kadha, Political, Entertainment, Telugu
|