వీరు.కె. దర్శకత్వంలో నందమూరి తారకరత్న అర్చన నరేష్ బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న చిత్రం 'మైక్ టెస్టింగ్ 143'. ఈ చిత్రంలో తారకరత్న దయానంద్ గా కనపించనున్నారు. ఉత్సవాలు పండుగల సమయాల్లో నాటకాలు వేసే కంపెనీ నడుపుతుంటాడు. ఈ చిత్రం గతం లో వచ్చిన సూపర్ హిట్ సినిమా కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్ సినిమా నుంచి ఇన్ స్పైర్ ఐ తీస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. తారకరత్న ఫ్లప్పుల దండయాత్రలకు ఈ చిత్రం తో నైనా బ్రేక్ పదనున్నదో లేదో చూడాలి.
దయానంద్‌కి నాటకాలంటే ఎంతో అభిమానం. ఓ సినిమాని వెండితెరపై గొప్పగా మలచాలని దర్శకుడు ఎంత తపన పడతాడో.. తను రూపొందించే నాటకం కూడా వేదికపై అదిరిపోయేలా ఉండాలని కష్టపడతాడు. దసరాకి నాటకం వేయడానికి రాయలసీమలోని ఓ ప్రాంతం నుంచి ఆహ్వానం అందుతుంది. అక్కడికి వెళ్లిన దయానంద్‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అనేది సినిమా గా తీస్తున్నామని దర్శకుడు వీరు.కె. మీడియా తో చెప్పారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Tarakaratna, naatakalu, Political, Entertainment, Telugu
|