" M .L .A " సినిమా ఎన్టీఆర్హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్నది. ఈ చిత్రానికి మొదట కొడాలి నాని నిర్మాత అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దిల్ రాజు సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ సమాచారం. ఇక చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రం స్క్రీన్ ప్లే ఇప్పటికీ పూర్తి చేసారు. పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చిత్రం ఉంటుందని చెప్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. గతంలో దిల్ రాజుఎన్టీఆర్ కాంబినేషన్ లో బృందావనం చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ ఊపు మీద వున్నా హరీష్ శంకర్ ఈ సినిమాకి డైరెక్టర్ కావడం తో సినిమా మీద అంచనాలు చాల వున్నాయి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:MLA, lo, naani, out, dilraju, inn, Political, Entertainment, Telugu
|