క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో చుక్కెదుర వడంతో ఇక సుప్రీంకోర్టు బాటపట్టాలని కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నేడు మరో పిటిషన్‌ను దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదులు నిర్ణయించారు. ఇప్పటికే ఢిల్లిసకి చేరుకున్న న్యాయవాదుల బృందం సోమవారం ఉదయం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మాజీ కేంద్రమంత్రి రాంజెఠ్మలాని నేతృత్వంలోని న్యాయవాదుల బృందం జగన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేయాలని సంకల్పించింది. సిబిఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని మూడు రోజుల విచారణలో తాను అనేక అంశాలు చెప్పినప్పటికీ నోరు మెదపలేదని హైకోర్టులో వాదించడాన్ని సవాల్ చేయనుంది.
హవాలా ద్వారా తన సంస్థల్లోకి నిధులు మళ్ళించానని సిబిఐ ప్రచారం చేస్తోందని తన సంస్థల్లోకి నిధులన్ని సక్రమ మార్గానే వచ్చాయని ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసే పిటిషన్‌లో పేర్కొంటున్నట్టు సమాచారం. ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో తనను ఉద్దేశపూర్వకంగా సిబిఐ అదుపులోకి తీసుకుందని తద్వారా ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిం చిందని పిటిషన్‌లో పేర్కొననుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడిగా తన పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేయవలసి ఉందని ఎన్నికల ప్రచారం ముగిసేంతవరకు తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును జగన్ కోరనున్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగుస్తుందని 11వ తేదీ ఉదయం తిరిగి ఏ న్యాయస్థానంలో లొంగిపోవాలన్నా కోర్టు ఆదేశాల ప్రకారం తాను నడుచుకుంటానని ఆయన ఆ పిటిషన్‌లో అభ్యర్థించనున్నారు. ప్రచారం నిర్వహించే ప్రాంతాలలో నియోజకవర్గాల్లో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ప్రతిరోజు రాత్రి రిపోర్టు చేస్తానని అభ్యర్థించనున్నారు. తనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి ఎనిమిది నెలలవుతోందని ఇన్ని రోజులులేని తొందర ఉపఎన్నికలు జరుగుతున్న సమయంలో సిబిఐకి తన విచారణ ఎలా గుర్తువచ్చిందని ప్రశ్నిం చనున్నారు. సిబిఐ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించి నట్టుగా తాను వైట్‌కాలర్ నేరగాడిని కాదని ఆర్థిక నేరాలకు పాల్పడలేదని ఎవరినీ బలవంతంపెట్టి తమ సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టించలేదని కోర్టుకు నివేదించనున్నారు. లోక్‌సభకు కొత్తగా ఎంపికైన 150 మంది ఎంపిలపై కేసులున్నాయని ఇందులో 75 మంది ఎంపిలపై నేరపూరితమైన ఆరోపణలు ఉన్నాయని అయినా వారు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని కడప ఎంపినైన తనను మాత్రం సిబిఐ వేధిస్తోందని ఎన్నికల ప్రచారానికి వెళ్ళనీయకుండా బెయిల్ మంజూరు చేయనీయకుండా అడుగడుగున అడ్డు తగులుతోందని తన పిటిషన్‌లో జగన్ పేర్కొననున్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:jagan, back, to, supreme, court, Political, Entertainment, Telugu
|