సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు చిత్రం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ. సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు వెంకటేష్ తమ్ముడిగా నటిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగి పోయాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్సే ఇందుకు నిదర్శనం. విడుదలైన తొలి రోజు ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ఏకంగా 2 27319 హిట్స్ సొంతం చేసుకోన్న ఈ చిత్రం లో డైలాగులు కూడా అంతే ఆకటుకునేలా ఉంటాయట.‘నేను కుటుంబాన్ని విడదీసే వాడినే అయితే ఈ కుటుంబంలో పుట్టే వాడినే కాదు'' అంటూ కుటుంబం పై తన ప్రేమను వ్యక్తం చేస్తూ మహేష్ బాబు చెప్పే డైలాగులు ఫ్యామిలీ ఆడియెన్స్ ని అమితం గా ఆకట్టుకున్టాయంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Nenu, kutumabanni, vidadisevadini, kadu, antunna, mahesh, Political, Entertainment, Telugu
|