వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరో రెండు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ మూడు రోజుల పాటు జగన్‌ను తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరగా రెండు రోజుల పాటు అప్పగిస్తూ కోర్టు తన నిర్ణయాన్ని శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఆదేశాలు జారీ చేసింది. రేపు ఎల్లుండి సిబిఐ జగన్‌ను ప్రశ్నిస్తుంది.
సిబిఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు జగన్‌ను కస్టడీకి అప్పగించింది. సిబిఐ కస్టడీకి కోర్టు షరతులు పెట్టింది. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాదుల సమక్షంలోనే జగన్‌ను విచారించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Jagan, Mohan, Reddys, CBI, custody, extended, by, two, more, days, 8206;|, Political, Entertainment, Telugu
|