రామ్ చరణ్ ఇన్విటేషన్లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి
ప్రియమైన అభిమానులకు మీ రామ్ చరణ్ నమస్సుమాంజలి. 2012 జూన్ 14వ తేదీన నా వివాహం ఉపాసనతో జరుగుతోందన్న సంగతి మీకు తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మీ కోసం ప్రత్యేకించి 2012 జూన్ 15వ తేదీన వివాహ రిసెప్షన్ నిర్వహిస్తున్నాము. మీకు నాన్నగారితో ఉన్న అనుబంధం నాకు తెలుసు. ఆయన కుమారుడినైన నన్ను కూడా మీ ఆదరాభిమానాలతో ఇంతటి వాణ్ణి చేశారు. అందుకే మీరంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. జూన్ 15వ తేదీన ఉదయం 11:15 నుంచి హిమాయత్ సాగర్‌లోని టెంపుల్ ట్రీస్ నందు కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరిగే వివాహ రిసెప్షన్‌కు మీరు విచ్చేసి మీ శుభాకాంక్షలు అందజేస్తేనే ఈ శుభకార్యం సంపూర్ణం అవుతుంది. కావున మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆహ్వానిస్తారని ఆశిస్తూ ఇదే నా హృదయ పూర్వక ఆహ్వానం.. మీ రాకతో కళ్యాణవేదిక కళకళలాడాలని ఆకాంక్షిస్తూ... మీ రామ్ చరణ్.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ram, Political, Entertainment, Telugu
|